దేవరాపల్లి, జయజయహే : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. మండలంలోని వేచలం గ్రామంలో గురువారం స్థానిక సర్పంచ్ నాగిరెడ్డి శఠారినాయుడు అధ్యక్షతన ప్రజలందరితో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీ కరణ చేస్తే పేద ప్రజల పిల్లలకు నష్టం వాటిల్లుతుందని తెలియజేశారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరంగా 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఇప్పడు కూటమి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజా వైద్యంతో మంచి పేరు వస్తుందనే భయంతో చంద్రబాబు నాయుడు ఆ 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
గ్రామంలో వైస్సార్సీపీ నాయకులు, ప్రజలు మొదటిగా సంతకాలు చేసి ప్రతీ ఇంటికి మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణ గూర్చి వివరించి సంతకాలు సేకరణ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి మండల పరిషత్ అధ్యక్షులు చింతల బుల్లి లక్ష్మి, జడ్పిటిసి కర్రి సత్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు, ప్రధాన కార్యదర్శి వేచలపు చిన్నం నాయుడు, సీనియర్ నాయకులు వేచలపు కృష్ణ, కర్రి కొండబాబు, బత్తి నాయుడు, బోడబల్ల లక్షణ్ రావు వేచలపు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన
Date:

