బల్క్ డ్రగ్ పార్కు బాధిత రైతులకు వైసీపీ సంఘీభావం

Date:

  • బాధితులకు అండగా ఉంటాం
  • ఏ స్థాయి పోరాటానికైనా సరే సిద్ధం
  • వై ఎస్ జగన్ కూడా స్వయంగా వస్తారు
  • న్యాయం జరిగే వరకు ఆందోళనలకు మద్దతు
  • వైసీపీ నేతలు బొత్స, కన్నబాబు, అమర్ అభయం
  • బల్క్ డ్రగ్ పార్కు బాధిత రైతులకు వైసీపీ సంఘీభావం
  • వైఎస్సార్ సీపీ ఛలో రాజయ్యపేట సక్సెస్

(అనకాపల్లి – జయజయహే)

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైయస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు కు వ్యతికంగా ఆందోళన చేస్తున్న రైతులును వైయస్సార్సీపీ నేతలు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైయస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త కురసాల కన్నబాబు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్, పలువురు వైయస్సార్సీపీ నేతలు పరామర్శించారు. వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ నేతలు అధికారంలోకి రాగానే మాట మార్చడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. పరిశ్రమల ఏర్పాటుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని… అయితే స్థానికులను ఒప్పించి వారికి న్యాయం చేసిన తర్వాతే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. బల్క్ డ్రగ్ పార్టు బాధితుల పోరాటానికి వైయస్సార్సీపీ అండగా ఉంటూ వారికి న్యాయం జరగడానికి ఏ స్ధాయిపోరాటానికైనా సిద్దమేనని వైయస్సార్సీపీ నేతలు తేల్చి చెప్పారు.

బాధితులకు అండగా ఉంటాం- బొత్స

ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు పెట్టాలి? బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి వచ్చాం. మత్స్యకార సోదరులతో మాట్లాడి, వారి ఇబ్బందులన్నీ తెలుసుకున్నాం. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటైతే మా కుటుంబాలు నాశనం అయిపోతాయి. మాకు బ్రతుకు తెరువు లేకుండా పోతుంది అని చెబుతూ… ఇవి కేవలం మా ఆవేదన మాత్రమే కాదు, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే, హోంమంత్రి అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో మా గ్రామాలకు వచ్చి ఇవే మాటలు చెప్పారు. అదేవిధంగా ఏ ప్రాంతానికైనా పరిశ్రమలు వచ్చి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అయితే… ఆ పరిశ్రమలు ఏర్పాటు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు, అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేదిలా ఉండాలి. వారిని ఒప్పించి పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నదే మా పార్టీ అభిమతం. అలా కాకుండా అధికారం మా చేతుల్లో ఉందన్న మదంతోనో, పోలీసు బలగాలతోనో చేస్తామంటే అది ప్రజాస్వామ్యంలో తగదు. ఆ నేపధ్యంలోనే ఇవాళ బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న ప్రజలు, మత్స్యకారులకు అండగా ఉండేందుకు ఇక్కడికి వచ్చాం. రానున్న రోజుల్లో ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకే ఏ కార్యక్రమమైనా జరగాలి తప్ప..వారి అభీష్టానికి వ్యతిరేకంగా చేసే ఏ కార్యక్రమాన్నైనా మా పార్టీ వ్యతిరేకిస్తుంది. రైతులకు అండగా ఉంటుంది. ప్రభుత్వం రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే… రైతుల పోరాటానికి అవసరమైన మా పార్టీ అధ్యక్షులు వైయస్.జగన్ కూడా వచ్చి వారి అండగా నిలబడతారు అని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేసారు.

ప్రజాభీష్టం పట్టని ప్రభుత్వమిది – మాజీ మంత్రి కన్నబాబు

ఇది నిలకడ లేని ప్రభుత్వం. ప్రజల సంక్షేమం, శ్రేయస్సు పట్టని ప్రభుత్వ మిది. పర్యావరణమంటే అస్సలు లెక్కలేదు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరో కార్యక్రమం లేదు. కూటమి పెద్దలు నుంచి చంద్రబాబు సహా ఆ పార్టీ దిగువ స్థాయి నేతలందరిదీ దోచుకోవడమే సింగిల్ పాయింట్ అజెండాలా తయారైంది. ప్రజాభీప్రాయానికి విలువలేకుండా… రైతులు, మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నా కూడా బల్క్ డ్రగ్ పార్టు పనులు చేపట్టడం దురదృష్టకరం. ఇదేంటని ప్రశ్నిస్తే వారి మీద ఎదురు దాడి చేస్తున్నారు. ఒకవైపు హోంమంత్రి పనులు నిలిపివేస్తామని రైతులకు హామీ ఇచ్చినా.. పనులు ఎక్కడా ఆగడం లేదంటే… హోంమంత్రి మాటకు ఉన్న విలువెంతో తెలుస్తోంది. రాజయ్యపేట గ్రామంలో 3 వేల మంది పోలీసులను మోహరించడం అత్యంత దౌర్భాగ్యం. రైతులేమైనా టెర్రరిస్టులా ? ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా స్ధానికలను ఒప్పించి, వారి అంగీకారం తీసుకున్న తర్వాత మాత్రమే ఏర్పాటు చేయాలి, ఆలా చేయలేని పక్షంలో మరో ప్రాంతానికి దాన్ని తరలించాలే తప్ప… రైతులు ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా…. బలవంతంగా వారిని నిర్భంధించి పరిశ్రమలు ఏర్పాటు చేయడం సరికాదు. 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి వేలాది ఎకరాల భూసేకరణకు స్థానికులు అంగీకరించలేదు. పెద్ద ఉద్యమం చేశారు. అనంతరం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరినీ ఒప్పించి… ఎయిర్ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వచ్చే ఏడాది ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తై ప్రారంభోత్సవం కూడా చేసుకోనుంది. అదే విధంగా అచ్యుతాపురం సెజ్ లో కూడా ప్రజలను ఒప్పించి భూసేకరణ చేశాం. రణస్థలం, బొబ్బిలి వంటిప్రాంతాలలో కూడా ఆయా ప్రాంతాల రైతులను ఒప్పంచి మాత్రమే భూసేకరణ చేశాం అని కన్నబాబు వెల్లడించారు.

రైతులకు అండగా ఉంటా- గుడివాడ అమర్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఈనెల 9వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉమ్మడి విశాఖజిల్లా పర్యటనకు వచ్చినప్పుడు రాజయ్యపేట గ్రామానికి చెందిన రైతులు, మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగాచేస్తున్న పోరాటం గురించి తమ ఆవేదనను తెలియజేసారు. ఆ సందర్భంగా వైయస్.జగన్ రైతులకు అండగా ఉంటామని, వారి పోరాటానికి సంఘీభావం తెలియజేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇవాళ రాజయ్యపేటకు వచ్చాం. ఈ గ్రామానికి వచ్చే క్రమంలో అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు, ఈ గ్రామానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మేం కేవలం రైతులకు అండగా ఉంటూ, వారి న్యాయమైన పోరాటానికి మద్ధతు తెలిపడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం. బల్క్ డ్రగ్ పార్క్ తో రాజకీయం చేయడం లేదు . ప్రభుత్వ నిర్భందాన్ని వ్యతిరేకిస్తున్నాం అని గుడివాడ అమర్ వ్యాఖ్యానించారు.

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/video-ukraine-hits-russian-submarine-in-first-underwater-drone-attack-9821975"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/uk-defence-chief-says-whole-nation-must-ready-to-fight-amid-russia-threat-9822050"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/perverse-trump-faces-outrage-over-sick-post-on-rob-reiner-wifes-death-9821567"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/nobel-peace-winner-maria-machado-fractured-vetebra-while-fleeing-venezuela-9821654"ని యాక్సెస్ చేయడానికి...