రాజమహేద్రవరం, జయజయహే: కూటమి ప్రభుత్వ అసమర్థ అరాచక పాలనలో రాష్ట్రంలో నిత్యం మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ,రాజమండ్రి సిటీ వైసీపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ మండిపడ్డారు.మహిళలకు రక్షణ కల్పించలేని టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాలికల వసతి గృహంలోని విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి నిరసన వ్యక్తం చేస్తూ గురువారం వసతి గృహం వద్ద భరత్ ఆధ్వర్యంలో ధర్నా జరగింది.జోరున వర్షం కురుస్తున్నా వైసీపీ శ్రేణులు ధర్నా చేసి టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో రోజూ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని,తెలియకుండా ఇంకా ఎన్నో జరుగుతున్నాయని ఆరోపించారు.24 గంటలూ మద్యం విక్రయించి తాగించడం వల్ల మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఆయన వ్యాఖ్యానించారు.రాజమండ్రి సిటీలో ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతకానితనం వల్ల నియోజకవర్గంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఆయన ఆరోపించారు.ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే ఒక మహిళను ప్రేమ పేరుతో నమ్మించి మోసగించి గర్భవతిని చేసి తర్వాత గర్భంలో పిండాన్ని చిదిమేశారని మార్గాని భరత్ మండిపడ్డారు.ఇప్పుడు బాలికల వసతి గృహంలోని విద్యార్థినిని దీపావళి రోజు బయటకు తీసుకువెళ్ళి అత్యాచారం చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ వసతి గృహంలోని బాలికలకు రక్షణ లేదని ఇదంతా ఈవీఎం ఎమ్మెల్యే చేతకాని తనం వల్లనే జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ధర్నాకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా వైసీపీ శ్రేణులు తమ ఆందోళన కొనసాగించాయి.
ఈవీఎం ఎమ్మెల్యే చేతకాని తనం వల్ల రాజమండ్రిలో మహిళలపై అత్యాచారాలు- మాజీ ఎంపీ మార్గాని భరత్
Date:

