యలమంచిలి, జయ జయహే న్యూస్ : ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరిస్తాం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో జనవాహిని కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుండి వర్షం కురుస్తున్న జనవాని కార్యక్రమానికి లబ్ధిదారులు హాజరై తమ వెనుతులను ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ కు అందజేశారు. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు హాజరు కావడంతో కొన్ని వినతలను అక్కడే పరిష్కరించి మరి కొన్ని వినతులను పరిశీలనకు తీసుకోవడం జరిగింది. వర్షం వచ్చినా లబ్ధిదారులకు న్యాయం చేసేందుకు జన వాహిని కి హాజరు కావడం జరిగిందని ఎమ్మెల్యే విజయకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బద్ధపు శ్రీను, ఊటకూటి రమేష్, గొర్లి బాబురావు ,వైస్ ఎంపీపీ రాజన శేషు ,పిల్ల తులసీరామ్, కొటారు శ్రీను, నాగేశ్వరరావు, లవుడు లోవ రాజు ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరిస్తాం-ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
Date:

