మాడుగుల మండలం వీరవిల్లి అగ్రహారంలో బుధవారం సాయంత్రం వీరవల్లి రూరల్ వాసవి వనిత క్లబ్ నూతనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నూతన పాలకవర్గంతో జిల్లా గవర్నర్ కే పూర్ణిమ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అంతర్జాతీయ వాసవి క్లబ్ ఉపాధ్యక్షుడు ఎస్ శ్రీను నూతన వనిత క్లబ్ ను ఆవిష్కరించారు. క్లబ్బు నూతన పిఎస్టిలుగా బత్తుల గంగా భవాని అధ్యక్షులుగా, పాలకుర్తి నాగమణి కార్యదర్శిగా, శ్రీనాదు స్వాతి కొసాధికారిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గవర్నర్ పూర్ణిమ మాట్లాడుతూ నూతన క్లబ్ ఉత్సాహంగా పనిచేసే ఒక ఆదర్శంగా నిలవాలని వి సి ఐ చేపట్టి కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్తమ క్లబ్ గా పేరు తెచ్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా పాల్గొన్న ఎస్ శ్రీను మాట్లాడుతూ అంతర్జాతీయ వాసవి క్లబ్ నిర్వహిస్తున్న వివిధ సేవా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రతి ఒక్కరూ వాసవి క్లబ్ లో వనిత క్లబ్ లో సభ్యులుగా చేరి సమాజంలో మరింత గుర్తింపు పొందాలని చెప్పారు. ఈ యాడాది 52 సేవా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ కె వి సత్యనారాయణ, క్లబ్ అక్షిక్షన్ ఎక్స్టెన్షన్ చైర్మన్ కొట్టాడా సాంబశివరావు, రీజనల్ చైర్మన్ పుట్ట నానాజీ, రీజన్ సెక్రెటరీ శ్రీనాథ్ మని, జోన్ చైర్మన్ పుట్టా మాధవి,జిల్లా అధికారులు పుట్ట మోహన్రావు, నాచు గున్నయ్య శెట్టి,స్థానిక క్లబ్బు ప్రతినిధులు శ్రీనాథ్ సత్యారావు,కే శ్రీను,కే గున్నయ్య శెట్టి,ఏం అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించారు. నూతన పిఎస్టి లను పలువురు ఘనంగా సత్కరించారు. అలాగే అతిధులను కూడా నిర్వాహకులు సత్కరించారు.
వీరవెల్లి రూరల్ నూతన వనిత క్లబ్ ప్రారంభం
Date:

