అనకాపల్లి జయ జయహే: నిత్యం, మరియు కార్తీక మాసంలో శివ పూజ చేయడం వలన పుణ్యఫలితాలను శుభ ఫలితాలను పొందుతారని ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్తీకమాసంలో ఆ పరమేశ్వరుడు జరుగు పూజ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా పంచామృతాభిషేకాలతో నిత్య పూజలతో ప్రతి వైభవంగా ఈ నెల రోజులు జరుగుతాయని అవి చూసి తరించిన వారు ఆ శివయ్య పూజలో పాల్గొన్నవారు చేయించుకున్న వారు కూడా తరతరాలు తరిస్తారని ఆయన పేర్కొన్నారు స్థానిక శారదా నది ఒడ్డున గల శ్రీ శ్రీ శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను ఎం వి ఆర్ కు ఆహ్వానించడం జరిగింది. భక్తులు మనోభావాలు దెబ్బ తినకుండా నొప్పించకుండా వారికి తగు ఏర్పాటు చేయాలని దర్శనం త్వరగా అయ్యే విధంగా చూడాలని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కమిటీ సభ్యులకు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అడ్లబోయిన నారాయణరావు, కార్యదర్శి బుద్ధ భగవాన్, ఆర్గనైజ్ సెక్రెటరీ పలక కాసులు, సహాయ కార్యదర్శి కంచి రామారావు, డైరెక్టర్ పళ్ళ శ్రీను, సతీష్ ఎం వి ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు
కార్తీక మాసంలో శివ పూజ చేయడం వల్ల మంచి పుణ్య ఫలితాలను పొందుతారు
Date:

