విశాఖపట్నం ( జయ జయహే) : ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా రోగులకు సేవలు అందజేస్తున్న కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 108 నర్సింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సూపర్నెంట్ డాక్టర్ ఐ. వానిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి.రాజశేఖర్ రెడ్డి, ఏపీ జిఈఏ నర్సింగ్ వింగ్ ప్రతినిధులు వి. ఉషాకుమారి, జైతు రవీంద్రనాథ్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేజీహెచ్ లో 34 హెడ్ నర్స్లు, పది రెగ్యులర్ స్టాఫ్ లు, 43 కాంటాక్ట్ నర్సింగ్ స్టాఫ్ లు అలాగే ట్రామా కేర్ లో 21 కాంటాక్ట్ నర్సింగ్ స్టాఫ్ నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిని తక్షణమే భర్తీ చేసే విధంగా రాష్ట్రస్థాయి అధికారులతో పాటు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, మంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇంత పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ ఉద్యోగులపై విపరీతమైన పని భారం పడుతుందని, రోగులకు అందించాల్సిన సేవల నాణ్యత తగ్గుతుందని వారు అన్నారు. సిబ్బంది కూడా తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడి గురవుతున్నారని, ఒక్కొక్క హెడ్ నర్స్ మూడు నుంచి నాలుగు వార్డులు పర్యవేక్షణ చేయాల్సి వస్తుందన్నారు. తక్షణమే ఈ పోస్టులు భర్తీకి సంబంధించిన విషయంపై డిఎంఈ,డైరెక్టర్ అఫ్ హెల్త్ అధికారులతో మాట్లాడి తగు చర్యలు చేపట్టాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. దీనిపై సూపర్డెంట్ సానుకూలంగా స్పందించారు.
కేజీహెచ్ లో నర్సు పోస్టులను భర్తీ చేయాలి.
Date:

