అరకులోయ: జయ జయహే: మండల కేంద్రంలోని అరకులోయ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో నేడు శుక్రవారం ఉదయం 10:00 గంటలకు వైయస్సార్ సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ చేయనున్నారు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం.ఈ కార్యక్రమానికి అరకులోయ నియోజకవర్గం పరిధిలో గల ఆరు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షులు. వివిధ హోదాల్లో ఉన్న పార్టీ ప్రతినిధులు తప్పక హాజరు కావాలని పార్టీ నేతలు కోరారు.
ఈ కార్యక్రమం ప్రజా సంక్షేమం, పార్టీ లక్ష్యాల సాధనలో ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది. వైయస్సార్ సీపీ ఎప్పటికీ ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని, ఈ పోస్టర్ ఆవిష్కరణ ఆ దిశగా మరో అడుగుగా ఉంటుందని అరకు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి తెలిపారు.
“నేడు” వైయస్సార్ సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ
Date:

