విశాఖపట్నం జయ జయహే: జీవీఎంసీ నాలుగవ జోన్ 32 వ వార్డు, సౌత్ జైల్ రోడ్డు లో బీటీ రోడ్డు నిర్మాణానికి గురువారం విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ అభివృద్ధికి చాలా ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ నగరం ముందుందని తెలిపారు. ఈ క్రమంలో దక్షిణ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు వార్డు అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నట్లు కొనియాడారు. వ్యక్తిగతంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆప్తుడుగా కొనియాడబడుతున్నారని ప్రశంసించారు.
డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ 32వ వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తన పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. 32 వ వార్డు అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నట్లు చెప్పారు. గత వైసిపి ప్రభుత్వ హయాముతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వార్డు మరింత అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. దశల వారీగా వార్డులో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో వార్డు అభివృద్ధికి మరింతగా కృషిచేసి విశాఖ నగరంలోనే ఒక మోడల్ వార్డుగా 32వ వార్డుని తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఈ వెంకటేశ్వరరావు, కాంట్రాక్టర్ అప్పలనాయుడు, కోదండమ్మ, వర, శ్రీదేవి, విజయ, నీల బాబు, శాలివాహన, సిపిఐ బుజ్జి, పండా రమేష్, బబ్బులు శ్రీను, రమేష్ శ్రీను, ఆదిబాబు, నాగేంద్ర, రమణ, తెలుగు లక్ష్మి ,తెలుగు అర్జున్, అప్పారావు, మణికంఠ, యాదగిరి, శ్రీను, కొట్నాల రమేష్, రాజశేఖర్, సత్తిబాబు, పట్నాయక్ ప్రసాద్, బద్రీనాథ్, కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

