విశాఖపట్నం జయ జయహే తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 10.వ తేదీ సోమవారం సాయంత్రం 5గం.ల నుండి పవిత్ర కార్తీక మాసంలో శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వరస్వామి దివ్య క్షేత్రం, ఋషి కొండ లో ఉచితంగా పూజా ద్రవ్యాలు ఇచ్చి సుమారు 5000 మంది భక్తులతో వైభవంగా కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం పూర్తిగా ధర్మప్రచార మండలి మరియు స్థానిక శ్రీ వెంకట అన్నమాచార్య ట్రస్ట్ , ఇతర ధార్మిక సంస్థలు సహకారం తో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను విశాఖపట్నం ఎంపీ మతకుమిల్లి భరత్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపిపి ప్రోగ్రాం అసిస్టెంట్ సత్యనారాయణ, రమాదేవి, సునీత కొటారి, డాక్టర్ వందన, మానేపల్లి లక్ష్మి పాల్గొన్నారు.
ఋషికొండలో కార్తీక దిపోత్సవం…ఉచితంగా పూజ ద్రవ్యాలు
Date:

