- స్థానిక ఎన్నికల్లో త్యాగాలకు సిద్ధం కావాలి
- కూటమి అభ్యర్థులు గెలుపే లక్ష్యం గా జనసైనికులు పనిచెయ్యాలి
- డా!! వంపూరు గంగులయ్య పిలుపు
పాడేరు, జయ జయహే అక్టోబర్ 23: స్థానిక ఎన్నికల్లో త్యాగాలకు సిద్ధం కావాలి. కూటమి అభ్యర్థులు గెలుపే లక్ష్యం గా జనసైనికులు పనిచెయ్యాలి అని పాడేరు నియోజకవర్గం, చింతపల్లి మండల కోర్ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జానపద కళలు మరియు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డా!! వంపూరు గంగులయ్య పిలుపునిచ్చారు. గురువారం జనసైనికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడేరు నియోజకవర్గం, చింతపల్లి మండలం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్ధుల విజయానికి ఆలోచనలు చేస్తూ చింతపల్లి మండలంలో 17 పంచాయతీలు 20 ఎంపీటీసీ సెగ్మెంట్లకు సంబంధించి సెగ్మెంట్ల వారిగా పార్టీ స్తితి గతులపై కోర్ కమిటీ సభ్యులతో చర్చించడం జరిగింది. కోర్ కమిటీ సభ్యుల సూచనలు స్థానికంగా పార్టీ పరిస్థితులు గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్ధులను క్షుణ్ణంగా కమిటీ సభ్యుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా రానున్న రోజుల్లో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా పాడేరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్ధులే గెలవాలనే లక్ష్యంతో పని చేసే దాంట్లో భాగంగా జనసేన పార్టీకి కేటాయించిన టీడీపీ పార్టీకి కేటాయించిన బీజేపీ పార్టీ కి కేటాయించిన ఆ కూటమి అభ్యర్ధుల గెలుపు కోసం మూడు పార్టీల వారు త్రికరణ శుద్ధితో పని చేయలని అన్నారు. ఈ సందర్భంలో సీట్లు త్యాగం చేయవలసిన పరిస్తితి వచ్చినప్పటికీ పార్టీ పిలుపుకు లోబడి పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోవాలని ప్రతి ఒక్కరు మానసికంగా సిద్దంకావాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జనపద కళలు మరియు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డా!! వంపూరు గంగులయ్య కోరారు. పార్టీకి విధేయులుగా ఉంటూ విజయమే లక్ష్యంగా గెలుపు అభ్యర్ధులను సహకారం చేసే దాంట్లో ప్రతి ఒక్కరూ త్యాగం తో కూడుకున్న రాజకీయాలు విజయం వైపు నడిచే ఆలోచన చెయ్యాలని అందుకు మన జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మనకు ఆదర్శమని అధినేత ఆదేశాల తగ్గట్టుగా నడుచుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. ఏదేమైనా కూటమి విజయమే మనందరి లక్ష్యమని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, చింతపల్లి ఏ ఏం.సి డైరెక్టర్ కిముడు. కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు ఉగ్రంగి లక్ష్మణ్ రావు, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ,కూడా రామకృష్ణ, పంచాయతీ అధ్యక్షులు, పాడేరు మండల నాయకులు కుంచె.దేవేంద్ర ప్రసాద్, లంకెల పవన్ తేజ్, చింతపల్లి నాయకులు చిన్ని రాజబాబు సుర్ల వీరేంద్ర, ఆర్. వినోద్, పి. దొరబాబు, పిసా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

