అవాకులు. చవాకులు పేలటం సమంజసం కాదు-తెదేపా అధికార ప్రతినిధి శేషు ధ్వజం

Date:

అవాకులు. చవాకులు
పేలటం సమంజసం కాదు

మాజీ సి ఎం జగన్ పై తెదేపా అధికార ప్రతినిధి శేషు ధ్వజం

జంగారెడ్డిగూడెం, జయ జయహే

కళ్ళు కూడా అర్పకుండా అబద్దాలుచెప్పడం లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ది అందే వేసిన చెయ్యని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు విమర్శించారు. గురువారం అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంపై ఆయనశ్యామ్ చంద్రశేషు మీడియాకు లేఖను విడుదల చేశారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని అత్యధిక రాయితీలు ఇచ్చారని వైసిపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సహేతూకం కాదని పేర్కొన్నారు.
ఓ మీడియాలో విపరీతమైన కధనాలు వేసి, వైసిపి సోషల్ మీడియాలో లేనిపోని అబద్ధాలు ప్రచారం చేసి, నేడు దేశవ్యాప్తంగానే కాకా ప్రపంచ వ్యాప్తంగా పేరు వస్తోంది అనే సరికి అది నా వల్లే వచ్చింది అని చెపౌకోవడం చూస్తుంటే జగన్ మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని ఎ ద్దేవా చేశారు.
హైదరాబాద్ బ్రాండ్ చంద్రబాబు అని ప్రపంచమే చెబుతోందని దాని క్రెడిట్ తీసుకోవడానికి వైఎస్ కుటుంబం ఎంత ప్రయత్నించినా ఫలితం రాదని విమర్శంచారు.ఓఆర్ఆర్ శంషాబాద్ ఎయిర్పోర్టు ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్టు ఎవరి వల్ల అనేది అందరికి తెలుసని చేయని పనుల కోసం క్రెడిట్ కోరుకోవడం జగన్మోహన్ రెడ్డి అత్యాశ, అమాయకత్వానికి నిదర్శనం అనిశేషు అన్నారు.
చంద్రబాబు అనే బ్రాండ్ వల్లే ఈ రాష్ట్రానికి కేవలం 15 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు క్యూ కట్టాయని నిన్న శోభా గ్రూప్ వారు 100 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారని ఇవన్నీ కళ్ళు తెరచి చూడాలని ఆయన ఎద్దేవా చేశారు.
నకిలీ అనే పదానికి పర్యాయ పదం జగన్మోహన్ రెడ్డి అని నకిలీకి రూపం ఇస్తే జగన్ ఫోటో వస్తుంది అని అలాంటి జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యంపై మాట్లాడటం విడ్డురం గా ఉంద అని శేషు అన్నారు.
మీ పాలన కాలంలో నకిలీ మద్యం వల్ల ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 27 మంది ప్రాణాలు బలైపోయాయి అని వారికి కనీసం ఆరోజు సంఘీభావం కూడా తెలపలేదని గుర్తు చేశారు. నకిలీ మద్యం కోసం కనీసం పర్మిషన్లు లేని ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమను పనిచేపించి విశాఖలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తి జగన్ అని అన్నారు.
ఎక్కడ కూడా జవాబుదారీతనం లేకుండా అక్రమాలకు పాల్పడి కేసుల్లో అడ్డంగా బుక్కై వాటి నుంచి డైవర్ట్ చేయడానికి లేనిపోని వాదనలు చేస్తూ ప్రజల్లో ఇంకా చులకన అయిపోతున్నారని తెలిపారు.
ఉద్యోగుల మీద ఎదో ప్రేమ ఉన్నట్లు మాట్లాడిన జగన్ చరిత్ర ఎప్పుడు లేని విధంగా ఐఆర్ కంటే జీతం పిటిమెంట్ తక్కువ ఇచ్చి జీతాల్లో కొత పెట్టిన ఘనుడు జగన్ అని కనీసం 10వ తేదీ వచ్చిన జీతాలు కూడా ఇవ్వని వ్యక్తి 6 డీఏ లు పెండింగ్ పెట్టిన వ్యక్తి జగన్ అని నేడు వారి కోసం మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన అన్నారు.
మీకు నిజంగా ప్రజా సమస్యలపై అంత ప్రేమ ఉంటే అసెంబ్లీకి రావాలని జగన్ కు శేషు సవాల్ విసిరారు. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి వెళ్లకపోతే సభ్యుడిగా అనర్హత పడుతుంది అని స్పీకర్ కు దీనిపై స్పందించాలని లేఖ రాస్తామని అన్నారు.
మెడికల్ కాలేజీల నుంచి మద్యం వరకు నిసిగ్గుగా అన్ని అబద్ధాలు ఆడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే ప్రతిపక్ష హోదా లేకుండా చేసారని ఇలానే చంద్రబాబు నాయుడును ఏక వచనంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రేపు పులివెందుల కూడా గెలవరని హెచ్చరించారు. ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు, అభివృద్ధి పై చర్చకు వచ్చే దమ్ముంటే రావాలని చర్చకు నేను సిద్ధం అని శేషు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/belgian-woman-went-missing-in-australias-tasmania-2-years-ago-now-her-phone-has-been-found-9809290"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/antisemitic-attack-obviously-donald-trump-on-deadly-sydney-beach-shooting-bondi-beach-shooting-australia-mass-shooting-9809320"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/social-media-screening-of-h-1b-h-4-visa-applicants-to-begin-from-monday-9809348"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/zelensky-offers-to-drop-nato-bid-in-exchange-for-western-security-guarantee-9809357"ని యాక్సెస్ చేయడానికి...