డిజిటల్ విధానంలో సమాచార సేకరణపై అధికారులకు దిశానిర్దేశం

Date:

  • ​డిజిటల్ విధానంలో సమాచార సేకరణపై అధికారులకు దిశానిర్దేశం

  • ​జి.కె. వీధి మండలంలో ముందు పరీక్షకు సన్నాహాలు

  • జిల్లా రెవెన్యూ అధికారి కె. పద్మాలత

పాడేరు,జయ జయహే : ​2027లో నిర్వహించనున్న జనాభా జనగణన ప్రక్రియలో భాగంగా, అల్లూరి సీతారామరాజు జిల్లా, జి.కె. వీధి మండలం పరిధిలోని 6 పంచాయితీల పరిధిలో ఉన్న 18 గ్రామాలలో నిర్వహించనున్న ప్రీ-టెస్ట్ ట్రైనింగ్ కార్యక్రమానికి సంబంధించి గురువారం జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నందు జరిగింది.
​జిల్లా రెవెన్యూ అధికారి కె. పద్మలత ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలోరాష్ట్ర జనాభా లెక్కల విభాగం సమన్వయకర్త ప్రసన్న కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం పాల్గొన్నారు

​ప్రక్రియ మొత్తం డిజిటల్ పద్ధతిలో రెండు దశల్లో జరుగుతుందని, మొబైల్ అప్లికేషన్ ద్వారా సమాచారం సేకరించబడుతుందని రాష్ట్ర బృందం వివరించింది. సేకరించిన సమాచారం అంతా సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం నందు నిక్షిప్తం అవుతుంది. ప్రతి 200 నుండి 250 గృహాలకు / లేదా 800 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ ఆధ్వర్యంలో జనగణన జరుగుతుంది.​మండల రెవెన్యూ అధికారి ఛార్జ్ ఆఫీసర్‌గా కీలక పాత్ర పోషిస్తారన్నారు. ప్రిన్సిపాల్ సెన్సెస్ ఆఫీసర్ నోడల్ అధికారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రక్రియ రాష్ట్రంలో మొదలవుతుంది. ప్రజలు ముందుగా స్వీయ-గణన ద్వారా కూడా తమ సమాచారాన్ని పొందుపర్చుకునే అవకాశం కల్పించబడుతుందన్నారు.​సహజ సరిహద్దులను ప్రామాణికంగా తీసుకుని బ్లాక్స్ ఏర్పాటు చేసి గణన చేపడతామని అధికారులు తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్.డి.ఓ. ఎస్.వి.ఎస్ లోకేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనా అధికారి కె. ప్రసాద్, కలెక్టరేట్ సూపర్‌డెంట్‌లు, జి.కె. వీధి, పాడేరు మండల రెవెన్యూ అధికారులు, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్‌లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/video-ukraine-hits-russian-submarine-in-first-underwater-drone-attack-9821975"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/uk-defence-chief-says-whole-nation-must-ready-to-fight-amid-russia-threat-9822050"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/perverse-trump-faces-outrage-over-sick-post-on-rob-reiner-wifes-death-9821567"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/nobel-peace-winner-maria-machado-fractured-vetebra-while-fleeing-venezuela-9821654"ని యాక్సెస్ చేయడానికి...