- ఉత్సాహంగా కోటి సంతకాల ఉద్యమం
- • ప్రజల నుండి సంతకాలు సేకరిస్తున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
పేద విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం నిర్మించిన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కానివ్వకుండా వైయస్ఆర్సీపీ చేపడుతున్న సంతకాల సేకరణ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజల నుండి నేరుగా సంతకాల సేకరణ చేపట్టారు. జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కోటి సంతకాల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి హాజరై వాహనదారులతో మాట్లాడి సంతకాలు సేకరించారు. సంతకాల సేకరణ ఉద్యమ కరపత్రాలను అందజేసి కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి పేదలు డాక్టర్లు కావాలన్న సంకల్పంతో, పేదలకు మెరుగైన వైద్యం అందివ్వడం కోసం నిర్మాణం చేపట్టిన 17 కాలేజీలను చంద్రబాబు తొత్తులకు ధారాధత్తం చేసేందుకు కుట్ర పన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి మంచి ఉద్దేశాన్ని అబద్దాలుగా చూపిస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని గుర్తుంచుకోవాలన్నారు.
జగనన్న చేసిన అభివృద్ధిని నేలమట్టం చేస్తే సహించేది లేదన్నారు. బీసీ సంఘం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ మాట్లాడుతూ దక్షణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని, ప్రతి వార్డులో క్షేత్రస్థాయిలో ప్రజల నుండి సంతకాల సేకరిస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బిపిన్ జైన్, వార్డు అధ్యక్షులు బాపు ఆనంద్, ముత్తబత్తల రమేష్, గనగల్ల రామరాజు, రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యదర్శిలు కంటుముచ్చు శాగర్, లండా రమణ, నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులు బొండాడ వెంకటరమణ, బెవర మహేష్, సూర్య,వీటి కృష్ణ, బిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వళ్ళి శ్రీను, కిషోర్ కుమార్, సంతోష్, చోడిపల్లి శివ, చాపల రాజు (బుడ్డా),సతీష్, మోహన్ శిరీష్ దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి శ్రేణులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

