- ప్రతీ ఒక్కరు మూడు అలవాట్లు కలిగి ఉండాలి
- మానసిక ఉత్సాహం, నేర్చుకోగలిగే తత్వం ఉంటే నిత్యయవ్వనులే
పాడేరు,జయ జయహే: ప్రతీ ఒక్కరు మూడు అలవాట్లు కలిగి ఉండాలని,మానసిక ఉత్సాహం, నేర్చుకోగలిగే తత్వం ఉంటే నిత్యయవ్వనులే అని ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీపూజ అన్నారు.
ప్రతి వ్యక్తికి మూడు అలవాట్లు తప్పనిసరిగా ఉండాలని గురువారం స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా యువజన సర్వీసుల శాఖ ఏర్పాటు చేసిన యువజనోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి హాజరైన వివేకానంద చిత్ర పఠానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మెదడుకు పదును పెట్టడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి శారీరక అలవాట్లు ఆటలు, నడక, నృత్యం తప్పనిసరిగా ఉండాలన్నారు. తద్వారా ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి, నిత్యం చురుకుగా ఉండగలమన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్ పై దృష్టి సారించాలన్నారు. బాగా చదువుకొని ఉద్యోగంలో లేదా వ్యాపారంలో స్థిరపడకపోతే ప్రయోజనం ఉండదని హెచ్చరించారు. సోమరితనం అనేది వయస్సుతో సంబంధం లేదని, అది మనసుకు సంబంధించినదన్నారు. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే ఉత్సాహం లేకుండా ఉంటే, వారి వల్ల కుటుంబానికి, దేశానికి ప్రయోజనం ఉండదన్నారు.
శారీరక వయస్సు కంటే మానసిక వయస్సు ముఖ్యమని, మానసిక ఉత్సాహం, నేర్చుకోగలిగే తత్వం ఉంటే నిత్యం యువకులుగా ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయన్నారు. విద్యార్థులు ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలని, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని, భవిష్యత్తులో భావి పౌరులుగా ఎదిగిన తర్వాత కూడా నిత్యం తమ హాబీలకు సమయాన్ని కేటాయించాలాన్నారు.
ఈ యువజనోత్సవ కార్యక్రమంలో సహాయ. కలెక్టర్ సాహిత్, జిల్లా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ కవిత వివిధ శాఖల అధికారులు వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు.

