ధవళేశ్వరం, జయ జయహే రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం గ్రామానికి చెందిన చొల్లంగి సత్యగిరి ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ నియామకంపై పార్టీ నేతలు, కార్యకర్తలు సత్యగిరికి అభినందనలు తెలుపుతూ, పార్టీ బలపర్చడంలో ఆయన పాత్ర కీలకమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చొల్లంగి సత్యగిరి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని పార్టీకి శక్తివంచన లేకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అదేవిధంగా ఈ పదవి రావడానికి కృషి చేసిన జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కు, రాజమహేంద్రవరం రూరల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
వైస్సార్సీపీ జిల్లా బీ.సీ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ చొల్లంగి సత్యగిరి
Date:

