నిరుపేదల ఐఏఎస్ గాంధీ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయులు కీర్తిశేషులు ఎస్.ఆర్.శంకరన్ 91వ జయంతి సందర్భంగా బ్యూరోక్రాసీ నాడు – నేడు అనే అంశం పై జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 గంటలకు గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో చర్చా గోష్టి ని నిర్వహిస్తున్నట్లు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగే చర్చా గోష్టి లో వక్తలుగా ఎస్.ఆర్.శంకరన్ జీవిత కృషిపై డాక్టరేట్ పొందిన ఇగ్నో అసిస్టెంట్ రీజినల్ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.ఎం.సౌజన్య, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ శాసనమండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం, వైస్ ప్రిన్సిపాల్, లయోల కాలేజ్ ప్రొఫెసర్ మొవ్వ శ్రీనివాసరెడ్డి లు ప్రసంగిస్తారని తెలిపారు. కీర్తిశేషులు ఎస్.ఆర్. శంకరన్ నిజాయితీగల ఐఏఎస్ అధికారిగా తన జీవితంలో నిరుపేదల ఉన్నతి కోసం చేసిన వెట్టి చాకిరి నిర్మూలన, సఫాయి వృత్తి నిర్మూలన, భూ సంస్కరణల అమలు, కారంచేడు బాధితులకు కాలనీ నిర్మాణము, 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు, షెడ్యూల్ కులాలు, తెగల సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర ప్రభుత్వం, నక్సలైట్ల మద్య శాంతి చర్చలు, అక్షరాస్యత ఉద్యమం, మద్య వ్యతిరేక ఉద్యమాలలో ఎస్.ఆర్.శంకరన్ చేసిన కృషిని చర్చ గోష్టిలో వక్తలు వివరిస్తారని ఆంధ్రప్రదేశ్ లో బ్యూరోక్రసీ నాడు ఎలా ఉంది, నేడు ఏ విధంగా మారింది వివరిస్తూ చర్చా గోష్టి నిర్వహించబడుతుందని తెలిపారు. ఆసక్తి గల ఎస్.ఆర్. శంకరన్ అభిమానులు, పేదలు బహుజను ల అభ్యున్నతిని కాంక్షించేవారు బ్యూరోక్రాసీ నాడు – నేడు పై జరిగే చర్చా గోష్టిలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఇట్లు
వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు
జనచైతన్య వేదిక
9949930670

