చోడవరం నియోజకవర్గ పరిధిలో గల బుచ్చయ్య పేట మండలం, విజయరామరాజు పేట కి చెందిన తుమ్మపాల రామకృష్ణ కి సీఎం సహాయ నిధి ద్వారా 1,52, 000రూపాయలు మంజూరు చేశారు.ఈ మేరకు బుధవారం ఆయనకి స్థానిక శాసన సభ్యులు కె ఎస్ ఎన్ ఎస్ రాజు గ్రామ నాయకుల సమక్షంలో చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూటమి ప్రభుత్వం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే లక్ష్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంతో సీఎం సహాయ నిధిని అందిస్తున్నారని చెప్పారు.

