డుంబ్రిగుడ: జయ జయహే, గసబ గ్రామ పంచాయతీ, మొర్రిగుడ గ్రామంలో జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆద్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణపై బాలల సంరక్షణ విభాగం లీగల్ ఆపీసర్ ఎస్ అశోక్ కుమార్ అధ్యక్షతన గురువారం అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో గసబ పంచాయతీ సిపిఎం సర్పంచ్ పాంగిసునీత హాజరై మాట్లాదారు. బాల్య వివాహాలు జరగకుండా అందరు బాద్యత తీసుకోవాలని కోరారు. ప్రతి ఆడ బిడ్డ చదువుకుని ఉన్నత స్థాయిలో రాణించాలనీ,.ఆడ పిల్లలపై రోజురోజుకి లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని వాటిపై అందరు అవగాహనా కలిగి ఉండాలని కోరారు. పోక్సోచట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం వంటి చట్టాలు ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో గసబ మహీళపోలిసు కె గాయత్రి, మొర్రిగుడ పాఠశాల ప్రాధనోపాధ్యాయులు,ఏఎన్ఎం రత్న కుమారి,అంగన్వాడీ,ఆశా కార్యకర్తలు, మహిళలు, పాఠశాల విద్యార్ధినిలు పాల్గొన్నారు.
బాలల సంరక్షణ హక్కుల పరిరక్షణ, పై అవగాహనా కార్యక్రమం
Date:

