పిహెచ్ సిని ఆకస్మిక తనిఖీ చేసిన డి ఎం అండ్ హెచ్ ఒ.

Date:

డుంబ్రిగుడ : జయ జయహే న్యూస్ :మండల కేంద్రంలోని డుంబ్రిగుడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా డి ఎం అండ్ హెచ్ ఒ గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి కృష్ణమూర్తి నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.సిబ్బంది విధి నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు.

అటెండెన్స్, మూమెంట్ రిజిస్టర్ ను పరిశీలించారు. విధులకు హాజరుకాని పారామెడికల్ ఆప్తాల్మిక్ అధికారి, యం.పిహెచ్ఇ ఓ హాజరు పట్టికలో సంతకం చేయకపోవడంతో వారిని మందలించారు.సిబ్బంది సమయపాలన పాటిస్తూ కేటాయించిన బాధ్యతలు విధిగా నిర్వర్తించాలని విధులపై నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పిహెచ్ సిలో వైద్యం కోసం వచ్చే రోగులకు సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్యం కొరకు వచ్చిన రోగులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వయంగా పరీక్షించి చికిత్సలు నిర్వహించారు. పిహెచ్ సిలో సుఖ ప్రసవాలు అధికంగా జరుపుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రసవం పొందిన బాలింతలతో మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత గూర్చి, వ్యాధి నిరోధక టీకాల గూర్చి, పౌష్టికాహారం గూర్చి అవగాహన కల్పించారు. కాన్పు అనంతరం రెండు రోజులు సిబ్బంది పర్యవేక్షణలో ఉండాలని, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు నిర్ధారించిన అనంతరం తల్లి బిడ్డ ఎక్ష్ ప్రెస్ వాహనం సహాయంతో వారి గ్రామానికి తరలించాలని సిబ్బందికి ఆదేశించారు. గ్రామాల్లో క్షేత్ర స్ధాయి సిబ్బంది ఇంటింటి సందర్శనలు గూర్చి, అందిస్తున్న వైద్య సేవల గూర్చి రోగులకు అడిగి తెలుసుకున్నారు. పి.హెచ్.సి లో ఉన్న ప్రసవ నిరీక్షణ కేంద్రాన్ని సందర్శించి గర్భిణి స్త్రీలతో ముచ్చటించారు. అన్ని వార్డులను మరియు ప్రసూతి గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. ల్యాబ్ ద్వార నిర్వహిస్తున్న పరిక్షలు మలేరియా కేసులను అందించిన చికిత్సలను అడిyగి తెలుసుకున్నారు. ఫార్మసీ ని తనిఖి చేసి అందుబాటులో ఉన్న మందులను వ్యాక్సీన్ లను పరిశీలించారు.
ఈ కార్యాక్రమంలో పిహెచ్ సి సిబ్బంది పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/your-australian-hero-pm-antony-albanese-meets-ahmed-al-ahmed-who-disarmed-sydneys-bondi-beach-shooters-9822912"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/statue-of-liberty-brazil-strong-winds-topple-statue-of-liberty-during-storm-not-the-one-in-new-york-9822998"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/inside-director-rob-reiners-fight-with-son-nick-reiner-at-conan-obriens-christmas-party-before-murder-9823043"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/jailed-former-prime-minister-imran-khan-gave-life-time-immunity-to-asim-munir-india-slams-pakistan-at-un-9822621"ని యాక్సెస్ చేయడానికి...