అరకువేలి/పెదబయలు: జయ జయహే: అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గం పెదబయలు మండలం పెద్ద కోడపల్లి పంచాయతీ పరిధిలోని దురుపల్లి.బంగారుపుట్టు. జైలువీధి. ఉర్రడ. కుసుమగరువు. తదితర గ్రామాల కు వంతెన లేకపోవడంతో రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఏడు సంవత్సరాల బాబు కు ఈ గెడ్డ పై ప్రాణాలు కోల్పోయాడని. విద్యా వైద్యం వివిధ అవసరాల నిమిత్తం గెడ్డ దాటుకుంటూ వెళ్లవలసి వస్తుందని. భారీగా వర్షం కురిసినప్పుడల్లా వాగు ఉధృతంగా రావడంతో రాకపోకలు సాగించలేకపోతున్నారని. అనేకమార్లు నాయకులకు అధికారులను విన్నవించుకున్నామని స్వతంత్రం ఏర్పడి 79 సంవత్సరాలు అవుతున్న ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు వచ్చిన మా బ్రతుకులు తప్పడం లేదని వాపోయారు. మాజీ ఎంపిటిసి సింహాచలం. వార్డు మెంబర్ రామారావు
మాట్లాడుతూ సంబంధిత అధికారులు స్పందించి గడ్డపై నూతనంగా బ్రిడ్జి నిర్మించాలని కోరారు.
వాగుపై వంతెన నిర్మించండి
Date:

