మలేరియా కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖి చేసిన డి ఎం అండ్ హెచ్ ఓ డా. డి కృష్ణమూర్తి నాయక్

Date:

మలేరియా కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖి చేసిన డి ఎం అండ్ హెచ్ ఓ
డా. డి కృష్ణమూర్తి నాయక్

పాడేరు : 23 అల్లూరి సీతారామరాజు జిల్లా మలేరియా అధికారి కార్యాలయంలో గురువారం అకస్మికంగా తనిఖి చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. డి కృష్ణమూర్తి నాయక్ తెలియజేసారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అల్లూరి జిల్లా మలేరియా అధికారి తులసి తో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పి.హెచ్.సిల వారిగా నమోదైన మలేరియా కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం తో పోల్చుకుంటే జిల్లా వ్యాప్తంగా అధికంగా నమోదైన పాడేరు డివిజన్ పరిధి 3 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, రంపచోడవరం డివిజన్ పరిధి 9 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు మరియు చింతూరు డివిజన్ పరిధి 6 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను గుర్తించడం జరిగింది. ఆయా పి.హెచ్.సి గ్రామాలలో నమోదైన మలేరియా కేసులకు సిబ్బంది ద్వార అందించిన రాడికల్ ట్రేట్మెంట్ (ఆర్.టి) చికిత్స వివరాలు, మాస్ మరియు కాంటాక్ట్ వివరాలు, చేపట్టిన ఏంటి లార్వాల్ ఆపరేషన్స్ మరియు పాగింగ్ చర్యల వివరాలను రిపోర్టు రూపంలో అందజేయాలని జిల్లా మలేరియా అధికారికి సూచించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మలేరియా నివారణ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
జిల్లా మలేరియా అధికారి, వి.బి.డి. కన్సల్టెంట్ మరియు ఆరోగ్య విస్తరణ అధికారి కీటక జనిత వ్యాధులు తీసుకుంటున్న చర్యలు కార్యకలాపాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి సమర్పించాలని. సబ్ యూనిట్ పరిధిలో ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సచివాలయంలో నిర్వహిస్తున్న విధులపై ఫీల్డ్ సందర్శనలు నిర్వహించి క్షేత్ర స్ధాయి సిబ్బంది సేవలను తనిఖి చేయాలని తెలియజేసారు. మలేరియా సాంకేతిక పర్యవేక్షకులు మలేరియా నివారణ మరియు నియంత్రణ కార్యక్రమాలకు సంబంధించిన సాంకేతిక విధులు, ఫీల్డ్ పర్యవేక్షణ, సిబ్బంది మార్గదర్శకత్వం, నమూనాల సేకరణ, దోమల నియంత్రణ వంటి కార్యక్రమాలను పర్యవేక్షించాలని అన్నారు. మలేరియా రోగులు సమీప ఆసుపత్రుల నుండి ఇతర జిల్లా ఆసుపత్రులకు రిఫరల్ సేవలపై వెళ్ళిన వారి వివరాలను సమయానికి సేకరిస్తూ జిల్లా కార్యాలయానికి నివేదించాలని అన్నారు. జిల్లా మలేరియా అధికారి కార్యాలయంలో సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని అన్నారు. జిల్లా మలేరియా అధికారి, వి.బి.డి. కన్సల్టెంట్ మరియు ఆరోగ్య విస్తరణ అధికారి ఉన్నతాధికారులు నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ , టెలి కాన్ఫరెన్స్ మరియు ఇతర సమావేశాలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తో కలిసి హాజరుకావాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/australia-holds-first-funeral-for-bondi-beach-attack-victims-9828941"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/rob-reiners-son-nick-reiner-to-face-murder-charges-in-parents-killing-9828850"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/2nd-doctor-in-matthew-perry-overdose-case-sentenced-to-home-confinement-9828923"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/donald-trump-imposes-full-travel-bans-on-5-more-countries-including-palestinians-9828795"ని యాక్సెస్ చేయడానికి...