అల్లూరిసీతారామరాజు జిల్లా పాడేరు (జయ జయహే): పాడేరు మండలం మోదాపల్లి పంచాయితీ మినుములూరు నుండి గాలిపాడు వరకు సుమారు మూడు కిలోమీటర్లు దూరం ఉంటుంది. కొన్ని సంవత్సరాలు నుండి పిల్లలు గాలిపాడు నుండి మినుములూరు వెళ్లి చదువుకోవలసిన పరిస్థితి .గత సంవత్సరం ఎం ఈ ఓ గాలిపాడు.గ్రామంలో పర్యటించి తాత్కలికంగా స్కూల్ ను ప్రారంభించి ప్రభుత్వ భవనం మంజూరు అయ్యేలా చెప్పి నేటికీ చాలా కాలం అయిందని తాత్క లిక స్కూల్ లేదు, ప్రభుత్వ భవనం లేదు. వర్షాకాలం లో ఇంట్లో నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. గాలిపాడు గ్రామానికి స్కూలు, అంగన్వాడీ బిల్డింగ్ లేదు,రోడ్డు సౌకర్యం లేదు, చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఉన్నాయి.
ప్రభుత్వాలు మారుతున్న మా గ్రామానికి మంచి చేసిందిలేదని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమైన మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. అలానే స్కూల్ మంజూరు చేస్తారని గ్రామ ప్రజలు స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.
అయ్యా కలెక్టర్ గారు… మా తల రాతలు మారవా?
Date:

