- లక్ష రూపాయలు విరాళం ప్రకటించిన వాసుపల్లి
- సమన్వయ కమిటీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్
విశాఖపట్నం జయ జయహే: బల్క్ డ్రగ్స్ పార్కును వ్యతిరేకిస్తూ నక్కపల్లి రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ.లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. స్థానికులకు ఒప్పించి వారి ఆమోదంతోనే కంపెనీలు ఏర్పాటు చేయాలని జగనన్న మాటగా డిమాండ్ చేస్తున్నట్లు వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు. ఆసీలమెట్టలో గల పార్టీ కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులు, మత్స్యకార నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటి మత్స్యకారుడిగా తన వాళ్ళు ఎక్కడ ఉన్నా.. అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు.
బల్క్ డ్రగ్ పార్ను వ్యతిరేకిస్తూ రాజయ్య పేట మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు వైఎస్సార్ సీపీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందన్నారు. స్థానికులను ఒప్పించి వారి ఆమోదంతోనే కంపెనీలు ఏర్పాటు చేయాలనీ గుర్తు చేశారు. ఇది జగనన్న మాటగా చెబుతున్నాం అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి లో వందలాదిమంది పోలీసులను దించడం కూటమి సర్కార్ సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దారులన్నీ దిగ్బంధం చేయడం పిరికి బంద చర్యగా ఆయన అభివర్ణించారు. సంఘీభావం తెలిపే నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రాజయ్యపేట మత్స్యకారులను ఒంటరి వాళ్లను చేసేందుకు యత్నించడం దారుణమన్నారు. వారం రోజులగా అమలవుతున్న కూటమి నేతల కుటిల నీతిని తుత్తునియలు చేస్తూ వైఎస్సార్సీపీl అండగా నిలిచి, మేమున్నామని భరోసా ఇచ్చిందన్నారు.
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహ న్రెడ్డి ఆదేశంతో ‘చలో రాజయ్యపేట’కు పిలుపునిచ్చి పార్టీ అగ్ర నేతలు గ్రామాన్ని ఇటీవల సందర్శించారనీ పేర్కొన్నారు. డ్రగ్ పరిశ్రమ ఆపే వరకు మత్స్యకారులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార అనుబంధ సంఘాల నాయకులు, దక్షిణ వైయస్సార్సీపీ శ్రేణులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ వార్డు అధ్యక్షులు, సినియర్ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

