నిద్రలేమిని.. నిద్రలేపిన ఇన్సోమ్నియా

Date:

సరైన నిద్ర లేకపోతే వచ్చే అనర్ధాల ఇతివృత్తంగా బుల్లితెర వేదికగా విడుదలైన లఘు చిత్రం “ఇన్సోమినియా”. బయలాజికల్ క్లాక్ కు వ్యతిరేకంగా పరుగులు తీస్తున్న మనిషి ఆరోగ్యం ఎలా తిరోగమనం చెందుతుందో నని తెలిపే ఆరోగ్య స్పృహను చక్కని పిక్చరైజేషన్తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు చిత్ర దర్శకుడు దేవేంద్ర నాయక్ భూక్య. రోజుల తరబడి నాణ్యమైన నిద్రకు కరువైన ఒక జంట ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు… దాని పర్యవసానాలు… కథాంశంగా ఈ చిత్రం రూపొందించారు. స్లీప్ సైకిల్ ను డిస్టర్బ్ చేసుకుంటూ నైట్ డ్యూటీలు చేస్తున్న నేటి సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవన చిత్రానికి ఈ చిత్రం అద్దం పడుతోంది. రాత్రుళ్ళు స్క్రీన్ టైమ్ లో ఎక్కువగా గడిపే వారికి ఈ చిత్రం ఒక హెచ్చరిక. సినీఫైల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత లచ్చిరాం బుకియా చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టి గడచిన జూన్ నెలలో విశాఖలో షూటింగ్ పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ హైదరాబాదులో పూర్తిచేసి దీపావళి నాడు యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ చిత్రంలో హీరో రంజిత్ గా సూరజ్ రెడ్డి, హీరోయిన్ భవ్యగా రచన కృష్ణమూర్తి తమ నటనా ప్రావీణ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పాలి. సూరజ్ రెడ్డి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, రచన కృష్ణమూర్తి నటన సహజంగా ఉన్నాయి. వీరిద్దరూ క్లాసికల్ డాన్సర్స్ కావడం విశేషం. సైకాలజిస్ట్ డాక్టర్ సూర్య ప్రకాష్ గా
కె.ఎం.కె. రమేష్, ఘోస్ట్ గా రోని (ఈశ్వర), చైల్డ్ ఆర్టిస్టులు సోనాక్షి నాయక్, అభయ్ కృష్ణ దత్, సహనటులుగా శ్రీదేవి, బి.కార్తికేయ, సత్యనారాయణ, రాధా భాయ్ నటించారు.

స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోమలేశ్వర్ సాయి (స్క్రీన్ ప్లే, డైలాగ్స్, కో డైరెక్షన్), వసంత్ ఆకుల (సినిమాటోగ్రఫీ), పార్థసారథి (పోస్టర్ డిజైన్), శ్రీ ఆంజనేయ కొమ్మూరి (డి ఐ), ఉష (మేకప్ ఆర్టిస్ట్), సాల్మన్ జక్కల (ఎస్ఎఫ్ఎక్స్, మిక్సింగ్ అండ్ మాస్టరింగ్), ఆనంద్ వర్ధన్ (ఎడిటర్) విజయ్ ఉయ్యాల (మ్యూజిక్), హర్షవర్ధన్ రెడ్డి (లిరిక్స్). చిత్ర బృందం టీం వర్క్ తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. 17 నిమిషాల నిడివిగల “ఇన్సోమినియా” చిత్రం ప్రేక్షకులను తట్టి లేపి ఆరోగ్య స్పృహను అందిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/india-gains-leverage-in-us-talks-as-exports-defy-trumps-steep-tariffs-9824927"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/every-australian-wanted-to-do-angry-man-stomps-on-bondi-beach-shooters-head-9828350"ని యాక్సెస్ చేయడానికి...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వ్‌లో "http://www.ndtv.com/world-news/bmws-to-fortuners-pm-narendra-modis-quiet-car-diplomacy-with-world-leaders-vladimir-putin-abiy-ahmed-al-hussein-bin-abdullah79282 సూచన #18.ef63717.1765906053.25b6aae https://errors.edgesuite.net/18.ef63717.1765906053.25b6aae Source link...

యాక్సెస్ నిరాకరించబడింది

యాక్సెస్ నిరాకరించబడింది ఈ సర్వర్‌లో "http://www.ndtv.com/world-news/who-is-princess-salma-of-jordan-her-countrys-first-woman-pilot-9826042"ని యాక్సెస్ చేయడానికి...