సినిమాల్లో కఠినమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలతో ప్రజల్లో సుప్రీం హీరోగా గుర్తింపు పొందిన మలయాళ నటుడు సురేష్ గోపి,నిజ జీవితంలోనూ అదే నిజాయితీని ప్రదర్శించారు.సినిమాల ద్వారా ప్రజల మన్ననలు పొందిన ఆయన, అనుకోకుండా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అయితే, ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో సురేష్ గోపి చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది.తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని,మళ్లీ సినిమాల్లో నటించాల్సిన అవసరం వచ్చిందన్నారు.అందుకే, మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు.దయచేసి దీనిని తప్పుగా భావించకండి,..అని ఆయన వినయపూర్వకంగా కార్యకర్తలను కోరారు.అంతేకాక,తన స్థానాన్ని కేరళకు చెందిన ఎంపీ సదానందన్ మాష్టారుకి ఇవ్వాలని కూడా సూచించారు.పదవి, అధికారం కంటే వ్యక్తిగత నిజాయితీను, స్వాభిమానంను ప్రాధాన్యంగా చూసిన ఈ నిర్ణయం రాజకీయ ప్రపంచంలో అరుదైనది. ఈనాటి పరిస్థితుల్లో వార్డు సభ్యుడు కూడా అధికార ప్రదర్శనతో వాహనంలో తిరిగే రోజుల్లో, ఒక కేంద్ర మంత్రి స్వయంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాజీనామా చేయడం స్ఫూర్తిదాయకమైన ఘట్టం.సినిమాల్లో మాత్రమే కాదు, జీవితంలోనూ సురేష్ గోపి. నిజాయితీ అనే విలువకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు.త్వరలో మళ్లీ వెండితెరపై ఆయనను చూడబోతున్న అభిమానులకు ఇది శుభవార్తగా పేర్కొనవచ్చు..

