మాడుగుల : జయజయహే : భర్త చనిపోయిన భార్యలు వితంతు పెన్షన్ల కోసం ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జి పుప్పాల రమేష్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో కూటమి నాయకులు కార్యకర్తలు చొరవ చూపాలన్నారు. 2023 డిసెంబర్ ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య పెన్షన్ పొందుతూ చనిపోయిన భర్తల స్థానంలో భార్యలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.కాబట్టి అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 25 నుంచి నెలాఖరు వరకు మీకు దగ్గరలో గల సచివాలయాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు. వారందరికీ మే ఒకటో తేదీ నుంచి వితంతు పెన్షన్ అందిస్తారన్నారు
కాబట్టి కూటమి నాయకులు కార్యకర్తలు తగు చొరవ చూపి మీ వార్డుల్లో ఎవరైనా అర్హులు ఉంటే గుర్తించి వారి చేత దరఖాస్తు చేయించవలసిందిగా విజ్ఞప్తి చేశారు .ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచవలసిందిగా భూత్ ఇన్చార్జిలను, కార్యకర్తలను కోరారు.