అనకాపల్లి: జయజయహే : శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా స్థానిక జీవీఎంసీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన *”మలేరియా అంతం మనతోనే* ” అనే నినాద ఇతివృత్తతో జివిఎంసి కార్యాలయం నుండి అనకాపల్లి పట్టణ ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అధ్యక్షతన ,జిల్లా మలేరియా అధికారి పర్యవేక్షణ లో ప్రపంచ మలేరియా దినం పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించటం జరిగిందని, మలేరియా నివారించటం మన అందరి చేతుల్లో ఉందని , ప్రతి ఒక్కరూ మలేరియా నివారణ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని తెలియజేస్థూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా . ఎం .శాంతి ప్రభ, జీవీఎంసీ జోనల్ కమిషనర్, జిల్లా ఆరోగ్య ప్రోగ్రాం అధికార్లు, జిల్లా మలేరియా అధికారి శ్రీ వరహాలు దొర,వైద్యాధికార్లు , మలేరియా అధికార్లు, మలేరియా సూపర్వైజర్లు, నర్సింగ్ కళాశాల విద్యార్ధులు, ఆరోగ్య పర్యవేక్షకులు ఎ ఎన్ ఎమ్ లు, ఆశాలు పాల్గొన్నారు.