- ప్రారంభమైన కార్తీక మాస ఉత్సవాలు
- ఘనంగా ఆకాశ దీపోత్సవం
చోడవరం అక్టోబర్ 22, జయ జయహే
చోడవరంలో కార్తీక మాస ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక స్వయంభు గౌరీశ్వర
స్వామి వారి ఆలయంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు యు ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కొరమంచిలి చలపతిరావు ఆధ్వర్యంలో అర్చక బృందం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనేకమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయంలో ఆకాశ దీపోత్సవ కార్యక్రమం ప్రారంభించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ తో పాటు దేవాదాయశాఖ అధికారులు, అన్నపూర్ణ అన్నదాన కమిటీ సభ్యులు స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆకాశదీపాన్ని దర్శించుకున్నారు. నవంబర్ 25 వరకు కార్తీకమాస ఉత్సవాలు నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.

