చోడవరం,అక్టోబర్ 22
చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బుధవారం మా దగ్గర విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నషాముక్త భారత్ అభియాన్” మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారి ఆదేశాల మేరకు ఎన్ ఎస్ ఐ డి కోఆర్డినేటర్ ఎస్.సోమేశ్, స్కూల్ అసిస్టెంట్,ఈ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ అబ్యూజింగ్ పై నిర్వహించిన అవగాహన సదస్సు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ ప్రారంభించారు.వైస్ ప్రిన్సిపాల్ ఐ వి వి సత్యవతి , ఐ క్యు ఏసి సమన్వయకర్త డాక్టర్ నారాయణ మూర్తి , డాక్టర్ మల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన” డ్రగ్స్ డిమాండ్ రెడక్షన్” శిక్షణలో భాగంగా చిన్న చిన్న కథలు, సామెతలు, మోటివేషన్ క్లాసులతో, మాదకద్రవ్యాలకు బానిసైన విద్యార్థులను ఎలా బయటికి తీసుకురావాలో వివిధ ఉదాహరణలతో ఆకట్టుకున్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డి మాల్యాద్రి, బి పిచ్చమ్మ, డాక్టర్ మలిబాబు, సిహెచ్ .సుధీర్, వి అప్పలనాయుడు, వెంకటేష్ ,డాక్టర్ సంధ్య శ్రీ, డాక్టర్ జ్యోతి, డాక్టర్ సూర్యవతి, డాక్టర్ కృష్ణారావు , డాక్టర్ వాసు రాజు,సరస్వతీ, రామలక్ష్మి, కోమల, కామర్స్ శ్రీనివాసరావు,కెమిస్ట్రీ సంతోష్, కంప్యూటర్స్ హేమ గణేష్, తదితర అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

