జయజయహే : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. సరిహద్దులో పటిష్ట భద్రతను పెంచింది. అలాగే పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మిలిటరీ అధికారులు జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చలు జరుపుతున్నారు. కాగా పాకిస్తాన్ కూడా తమ సైన్యానికి సెలవులు రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.