డీజీపీ తో పలు సమస్యలపై చర్చించిన మంత్రి
ఈగిల్ దళం కార్యాచరణ, ప్రణాళిక అంశాలపై మంత్రి చర్చ
మంగళగిరి : జయజయహే : సరైన పర్యవేక్షణ, నిఘాతో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం విరివిరిగా తగ్గించి, సామాన్యుల జీవితాలు, కుటుంబాలు నాశనం కాకుండా యువతతో పాటు ముక్కుపచ్చలారని విద్యార్థులు, చిన్నారులను ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా ఉజ్వల భవిష్యత్తును ఏర్పాటు చేసుకునే విధంగా పోలీస్ ఉన్నతాధికారులు కార్యాచరణ చేపట్టాలని, ప్రత్యేకంగా అన్నమయ్య జిల్లాలో ప్రత్యేక దృష్టి పెట్టాలని మంగళగిరి లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) అధికారిక కార్యాలయంలో డీజీపీ హరీశ్ గుప్తా గారితో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సమావేశమై సంభందిత అంశాలపై చర్చించారు.అనంతరం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఈగిల్) (IGP) రవికృష్ణ ని కలిసి రాయచోటి నియోజక వర్గంలో ఈగిల్ దళం కార్యాచరణ ప్రణాళిక అంశాలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి చర్చించారు.